నందిగామ నియోజకవర్గంలో ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఇటీవల వైసీపీ నిర్వహించిన బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమంలో ఎమ్మెల్సీ మొండితోక అరుణకుమార్ రప్ప రప్ప నరుకుతాం అంటూ చేసిన వ్యాఖ్యలు రాజకీయన్ని హీటెక్కించాయి. ఇప్పటికే నియోజకవర్గంలో పలు పోలీస్ స్టేషన్లో ఆయనపై టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఫిర్యాదుల మీద ఫిర్యాదులు చేశారు.