మానవత్వం చాటుకుంటూ, నందిగామ మండలం మాగల్లుకు చెందిన తమ్మిశెట్టి యశ్వంత్ కుమార్ అనే తలసేమియా వ్యాధితో బాధపడుతూ బెంగళూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న లబ్ధిదారుడికి, వెటర్నరీ అసిస్టెంట్ గుంటి సైదులు స్వయంగా వెళ్లి మూడు నెలల పింఛను రూ. 30 వేలు అందజేశారు. పింఛను రద్దు కాకుండా ఉండేందుకు 14 గంటల ప్రయాణం చేసి ఈ సేవ చేసిన సైదులును లబ్ధిదారుడి కుటుంబసభ్యులు, గ్రామస్థులు అభినందించారు.