నందిగామ: ఇసుక ట్రాక్టర్లను అడ్డుకున్న గ్రామస్థులు

నందిగామ మండలం అంబరుపేట గ్రామంలో అమ్మవారి తిరుణాళ్ల సందర్భంగా గ్రామస్థులు ఇసుక ట్రాక్టర్లను అడ్డుకున్నారు. పగలు రాత్రి తేడా లేకుండా ఇసుకను నిర్మానుష్య ప్రదేశంలో డంప్ చేసి లారీల ద్వారా హైదరాబాద్‌కు తరలిస్తున్నారని, ట్రాక్టర్లు తమను భయబ్రాంతులకు గురిచేస్తూ వేగంగా వెళ్తున్నాయని గ్రామస్థులు ఆరోపించారు. సమాచారం అందుకున్న ఎస్సై సూర్యవంశీ ఆరు ట్రాక్టర్లను స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్