నందిగామలోని రామలింగేశ్వరస్వామి ఆలయంలో శ్రీ శుఖ శ్యామలాంబ సమేత రామలింగేశ్వరస్వామి కళ్యాణ మహోత్సవం మాఘ శుద్ధ చతుర్దశి సందర్భంగా వైభవంగా జరిగింది. వేద పండితుల మంత్రోచ్ఛరణలు, మంగళవాయిద్యాల నడుమ స్వామికి శాస్త్రోక్తంగా వివాహ వేడుక నిర్వహించారు. వేలాదిగా తరలివచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణం శివనామస్మరణతో మారుమోగింది. స్వామికి పట్టువస్త్రాలు సమర్పించి, భక్తిశ్రద్ధలతో తలంబ్రాల వేడుకను పూర్తిచేశారు.