చందర్లపాడులో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం

చందర్లపాడు (M) గుడిమెట్ల గ్రామంలో గురువారం "సుపరిపాలనలో తొలి అడుగు" కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించామన్నారు. వాటి ప్రయోజనాలను తెలియజేసే కరపత్రాలను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. గ్రామస్థాయిలో ప్రజలతో నేరుగా సంభాషించి, వారి సమస్యలను అర్థం చేసుకునేందుకు ఈ కార్యక్రమం ఒక వేదికగా నిలిచిందన్నారు.

సంబంధిత పోస్ట్