రహదారిపై చెట్టు, వాహనదారులకు తీవ్ర అంతరాయం

వీరులపాడు మండలం పెద్దాపురం- జయంతి గ్రామాల మధ్య రహదారిపై చెట్టు అడ్డంగా పడటంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చెట్టు కారణంగా ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ మార్గంలో ప్రయాణించేవారు అప్రమత్తంగా ఉండాలని, సంబంధిత అధికారులు వెంటనే స్పందించి చెట్టును తొలగించాలని గ్రామస్థులు విజ్ఞప్తి చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్