నూజివీడు ట్రిపుల్ ఐటీలో జరిగిన దురదృష్టకర ఘటనపై రిజిస్ట్రార్, డైరెక్టర్ అమరేంద్ర కుమార్ స్పందించారు. పరీక్షకు అనుమతించకపోవడంతో విద్యార్థి వినయ్ యాపిల్ కత్తితో ప్రొఫెసర్ గోపాలరాజుపై దాడి చేశారని సోమవారం రాత్రి తెలిపారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా నిరోధక చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.