బాలికొన్నత పాఠశాల ఆవరణలో ఉచిత మెగా మెడికల్ క్యాంపు నిర్వహణ

స్థానిక జిల్లా పరిషత్ బాలికొన్నత పాఠశాల ఆవరణలో ఆదివారం నడిం తిరువూరు సొసైటీ, సెంటీని సిటీ, మాన్వీ హాస్పిటల్స్ సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత మెగా మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయనున్నట్లు సొసైటీ చైర్మన్ కంచి రఘు ప్రవీణ్ (బాబీ) బుధవారం తెలిపారు. సమాజ సేవలో భాగంగా నిర్వహించే ఈ క్యాంపులో న్యూరో సర్జరీ, న్యూరాలజీ, ప్రసూతి, గైనకాలజీ, జనరల్ సర్జరీ, జనరల్ మెడిసిన్, బీపీ, థైరాయిడ్, విషజ్వరాలు వంటి వ్యాధులకు ఉచిత వైద్య పరీక్షలు, మందులు అందిస్తారు. తిరువూరు పట్టణ, పరిసర ప్రాంత ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. సొసైటీ పరిధిలో 27.54 కోట్ల టర్నోవర్ సాధించి, 6405 యూరియా, కాంప్లెక్స్ బస్తాలు 312 మంది రైతులకు 238.94 కోట్ల విలువైన సేవలు అందించినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్