ముసునూరు: పాము కాటుకు గురై వృద్దుడు మృతి

ముసునూరు మండలం అక్కిరెడ్డిగూడెం గ్రామానికి చెందిన రైతు ముత్తం శెట్టి భాస్కరరావు (65) పాముకాటుకు గురై మృతి చెందారు. స్థానికుల వివరాల మేరకు.. భాస్కర్ రావు బుధవారం ఎప్పటిలాగానే పొలం పనులకు వెళ్లారు. పనులు చేస్తుండగా పొలంలో పాము కాటేసింది. ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్