విద్యుత్ స్మార్ట్ మీటర్లను వ్యతిరేకిస్తూ ఆగష్టు 5న వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో నిర్వహించే నిరసన కార్యక్రమం జయప్రదం చేయాలని సీపీఐ నాయకులు విజ్ఞప్తి చేశారు. వైసీపీ ప్రభుత్వం 9 సార్లు విద్యుత్ చార్జీలు పెంచి 32 వేల కోట్ల రూపాయలు ప్రజలపై భారం వేసిందన్నారు. ప్రజలపై అదనపు భారం మోపిందని సీపీఐ నూజివీడు నియోజకవర్గ సమితి కార్యదర్శి నిమ్మగడ్డ నరసింహా విమర్శించారు.