రాష్ట్రంలోని నాలుగు ట్రిపుల్ ఐటీల్లో పీయూసీ మొదటి సంవత్సరం తరగతులు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా రెండు రోజుల పాటు విద్యార్థులకు ఓరియెంటేషన్ క్లాసులు నిర్వహించనున్నారు. ఈ ఏడాది నుంచి ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీల పీయూసీ విద్యార్థులకు నూజివీడు ట్రిపుల్ ఐటీలోనే తరగతులు నిర్వహించబడతాయి.