నూజివీడు: 'హెల్మెట్ ధరించి వాహనం నడపాలి'

ప్రతి వాహనదారుడు హెల్మెట్ ధరించి వాహన నడపాలని ఆగిరిపల్లి ఎస్ఐ శుభ శేఖర్ అన్నారు. సోమవారం రాత్రి ఆగిరిపల్లి మండలం అడవినెక్కలం గ్రామంలో విజిబుల్ పోలీస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. చట్టాలపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని ఆయన విజ్ఞప్తి చేశారు. మైనర్లకు వాహనాలు ఇవ్వొద్దని పోలీసులు, తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ ప్రయాణంపై అవగాహన కలిగి ఉండాలన్నారు.

సంబంధిత పోస్ట్