నూజివీడు: కార్మికులకు కనీస వేతనం అందించాలి

కార్మికులకు కనీస వేతనం రూ. 26వేలు ఇవ్వాలని సీఐటీయూ కార్యదర్శి కొడవలి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. బుధవారం ముసునూరు మెయిన్ సెంటర్లో అంగన్వాడీలు, ఆశా వర్కర్లు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. అంగన్వాడీ, ఆశా, మధ్యాహ్న భోజన పథకం, నేషనల్ హెల్త్ మిషన్, సమగ్ర శిక్ష, వెలుగు, మెప్మా, సేంద్రియ వ్యవసాయం, 108, 104ల్లో పనిచేస్తున్న వారిని ఉద్యోగులుగా గుర్తించాలని, లేబర్ కోడ్స్ ను వెంటనే రద్దు చేయాలని అన్నారు.

సంబంధిత పోస్ట్