బడి ప్రారంభం: విద్యార్థులకు ఉచిత పుస్తకాల పంపిణీ

ఐనపూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం, 12 జూన్ 2026న బడి ప్రారంభోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. పాఠశాలకు వచ్చిన విద్యార్థులకు ఉపాధ్యాయులు పూలతో స్వాగతం పలికారు. కమిటీ చైర్మన్ దూడల శివనాగభవాని చేతుల మీదుగా విద్యార్థులందరికీ ఉచిత పాఠ్యపుస్తకాలు అందజేశారు. పాఠశాలలో అమలు జరుగుతున్న సంక్షేమ పథకాలు, మధ్యాహ్న భోజన పథకం తీరును పర్యవేక్షించి, భోజనం రుచిగా ఉందని సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్