ఏలూరు, నూజివీడు ప్రాంతానికి చెందిన ముసునూరు మండలం, గోపవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థిని తాటిగడప వాసంతి త్రిబుల్ ఐటీ సీటు సాధించింది. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ ఎల్ వి నాగేంద్రరావు, మండల విద్యాశాఖ అధికారులు శ్రీ దేవ వరప్రసాద్, శ్రీ బీవీఎస్ సుబ్బారావు వాసంతిని అభినందించారు. కష్టపడితే ఫలితం దక్కుతుందని వాసంతి నిరూపించిందని, ఆమెను ఇతర విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలని శ్రీ సుబ్బారావు సూచించారు. గోపవరం పాఠశాల ఉపాధ్యాయులను కూడా ఆయన అభినందించారు.