మే 1న పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం

కృష్ణా జిల్లా పమిడిముక్కల మండలం వీరంకిలాకులో మే 1న జరగనున్న పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొననున్నారు. ఈ పర్యటనకు సంబంధించి ఎమ్మెల్యే కుమార్ రాజా, టీడీపీ జిల్లా అధ్యక్షుడు గరుమూర్తి ఆదివారం ఏర్పాట్లను పర్యవేక్షించారు. హెలీప్యాడ్, సభా ప్రాంగణాన్ని పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. సీఎం రాక నేపథ్యంలో ఎటువంటి లోటుపాట్లు లేకుండా కార్యక్రమం విజయవంతం చేయడానికి అధికార యంత్రాంగం కృషి చేస్తోంది.

సంబంధిత పోస్ట్