పామర్రు మండలం కొమరవోలు వద్ద ఓ ఆటో పంట కాలువలోకి దూసుకెళ్లింది. గుడివాడ నుంచి పామర్రు వస్తుండగా, అదుపుతప్పికాలువలోకి దూసుకెళ్లి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మందికి స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు సహాయంతో ప్రయాణికులను రక్షించి, 108 అంబులెన్స్ ద్వారా ఆసుపత్రికి తరలించినట్టు పోలీసులు తెలిపారు.