ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు ఎరువులు విక్రయిస్తే సంబంధిత అధికారులకు రైతులు ఫిర్యాదు చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ అడిషనల్ డైరెక్టర్ విజయలక్ష్మి రైతులకు సూచించారు. కూచిపూడిలో సోమవారం ఎరువులు, పురుగుల మందుల దుకాణ యజమానులతో ఆమె సమావేశం నిర్వహించారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన దృశ్య ఎరువులు అందుబాటులో ఉండే విధంగా డీలర్లు చర్యలు తీసుకోవాలన్నారు. మొవ్వ మండలంలో సాగు విస్తీర్ణం గురించి అడిగి తెలుసుకున్నారు.