మొవ్వ: మినుము కొనుగోలు కేంద్రం ప్రారంభించిన ఎమ్మెల్యే

మొవ్వలో మార్క్ ఫెడ్ ద్వారా మినుములు, పెసలు కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా సోమవారం సాయంత్రం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, రైతుల కోసం ప్రభుత్వం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టినట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ వాటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మినుములకు రూ. 7800, పెసలకు రూ. 8678 ప్రభుత్వం మద్దతు ధర చెల్లిస్తుందని తెలిపారు.

సంబంధిత పోస్ట్