కూచిపూడి పరిధిలోని చినముత్తేవి శివారు శ్మశానం దగ్గర కోడి పందేలు నిర్వహిస్తున్నారనే సమాచారం మేరకు శుక్రవారం సాయంత్రం కూచిపూడి ఎస్. ఐ సురేష్ దాడి నిర్వహించారు. ఈ దాడిలో ఐదుగురు వ్యక్తులు పట్టుబడ్డారు. వారి వద్ద నుండి ఒక కోడిపుంజు, రూ. 3, 200 నగదు, మూడు మొబైల్ ఫోన్లు, రెండు మోటార్ సైకిళ్లు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.