మొవ్వ: పేకాట శిబిరంపై పోలీసులు మెరుపు దాడి

కూచిపూడి పోలీస్ స్టేషన్ పరిధిలోని బట్లపెనుమర్రు గ్రామ పరిధిలో పేకాట ఆడుతున్నారని కూచిపూడి ఎస్ఐ విశ్వనాధ్ కు వచ్చిన విశ్వసనీయ సమాచారం మేరకు శుక్రవారం సాయంత్రం డ్రోన్ కెమెరాతో నిఘా ఏర్పాటు చేశారు. ఎస్ఐ మరియు సిబ్బంది పేకాట ఆడుతున్న ఏడుగురిని అదుపులోనికి తీసుకొన్నారు. వారి వద్ద నుండి రూ. 1430 నగదును స్వాధీనం చేసుకున్నారు. కూచిపూడి పోలీస్ స్టేషన్ నందు వారిపై కేసు నమోదు చేయడం జరిగింది.

సంబంధిత పోస్ట్