ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో మొవ్వ మండలంలో విద్యుత్ ఛార్జీలు భారాలు తగ్గించాలని, స్మార్ట్ మీటర్ల బిగింపు రద్దు చేయాలని కోరుతూ ఇంటింటికి సంతకాల సేకరణ కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. ఆగస్టు 5 మండల కేంద్రాల్లో జరిగే ధర్నా కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరినారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు మద్దుల బసవరావు, కౌలు రైతు సంఘం నాయకులు వెంకటాద్రి, చిన్నం వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.