మొవ్వ: అంగరంగ వైభవంగా శ్రీ లక్ష్మీపతి స్వామి కళ్యాణం

మొవ్వ మండలంలోని ఆధ్యాత్మిక కేంద్రమైన పెదముత్తేవిలో బుధవారం రాత్రి శ్రీ లక్ష్మీపతి స్వామి కళ్యాణ మహోత్సవం అంగరంగవైభవంగా, సాంప్రదాయ రీతిలో, శాస్త్ర యుక్తంగా నిర్వహించారు. వేదపండితుల మంత్రోచ్ఛారణలు, మంగళ వాయిద్యాల హోరు నడుమ జరిగిన ఈ దివ్య కళ్యాణానికి శ్రీ లక్ష్మీపతి స్వామి దేవాలయవ్యవస్థాపక ధర్మకర్త, ముముక్షుజన మహాపీఠాధిపతులు ముత్తేవి గౌర కృష్ణ దంపతులు హాజరై పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్