దిత్వా తుఫాను కారణంగా కురుస్తున్న వర్షాల వల్ల రైతులు నష్టపోకుండా, యుద్ధ ప్రాతిపదికన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని పామర్రు మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్, తహసిల్దార్ కమస్తాన్‌ను కోరుతూ బుధవారం సాయంత్రం వినతిపత్రం అందజేశారు. ధాన్యానికి గిట్టుబాటు ధర లేక, ప్రభుత్వం సకాలంలో కొనుగోలు చేయకపోవడంతో రైతులు పండించిన ధాన్యాన్ని రహదారుల పక్కన గుట్టలుగా పోసుకుని ఆరబోసుకున్నారని ఆయన తెలిపారు.