పామర్రు మండలం కనుమూరు వద్ద విజయవాడ-మచిలీపట్నం జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న పెడసనగంటి సోమేశ్వరరావు(47)ను వెనుక నుంచి కారు ఢీకొని ఆగకుండా వెళ్లిపోయింది. ఈ ఘటనలో యద్దనపూడి గ్రామానికి చెందిన సోమేశ్వరరావు అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.