పామర్రు: తృటిలో తప్పిన పెను ప్రమాదం

పామర్రు మండలంలో మంగళవారం ఉదయం తృటిలో పెను ప్రమాదం తప్పింది. కొమరవోలు గ్రామ జాతీయ రహదారి వద్ద పంట కాలువలోకి ఆటో బోల్తా కొట్టింది. ప్రమాదంలో ఇరువురికి తీవ్ర గాయాలు కాగా, మరో 8 మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. గాయపడిన వారిని హుటాహుటిన 108 వాహనం ద్వారా గుడివాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్సలు అందిస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పామర్రు పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్