పేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి అండగా నిలుస్తుందని పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా పేర్కొన్నారు. శుక్రవారం పామర్రు మండలం ఉరుటూరు గ్రామంలో నర్రా ఇందిర అనే లబ్ధిదారునికి రూ. 30 వేల సీఎం సహాయనిధి చెక్కును ఆయన అందజేశారు. నియోజకవర్గంలో ఇప్పటివరకు రూ. 3 కోట్ల వరకు సీఎం సహాయనిధి అందించినట్లు ఎమ్మెల్యే తెలిపారు.