పామర్రు: దాతలు ముందుకు రావాలి

జిల్లాలో స్మశాన వాటికల అభివృద్ధికి దాతలు ముందుకు రావాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ పిలుపునిచ్చారు. మంగళవారం, పామర్రు నియోజకవర్గంలోని తోట్లవల్లూరు మండలం నార్త్ వల్లూరులో ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజాతో కలిసి హిందూ స్మశాన వాటికకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ అభివృద్ధికి ఉపాధి హామీ నిధుల నుండి 20 లక్షల రూపాయలు కేటాయించగా, స్థానిక గ్రామస్తులు ఒక కమిటీగా ఏర్పడి మరో 16 లక్షల రూపాయలు సమకూర్చారు. ఈ సందర్భంగా కలెక్టర్ దాతృత్వాన్ని ప్రశంసించారు.

సంబంధిత పోస్ట్