పామర్రు: నాలుగేళ్ల ప్రేమ.. పెళ్లికి నిరాకరణ.. ఆత్మహత్యాయత్నం!

ప్రేమికుడు పెళ్లికి నిరాకరించాడని బాధతో యువతి ఆత్మహత్యయత్నానికి పాల్పడిన సంఘటన పామర్రు మండలం కనుమూరులో జరిగింది. గౌతమ్-స్వరూప నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకోమని నిలదీయగా అతను నిరాకరించాడు. రాజీ చేసేందుకు పెద్దలు ప్రయత్నించినా, గౌతమ్ పెళ్లికి ఒప్పుకోలేదు. దీంతో సోమవారం స్వరూప విషం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా కుటుంబీకులు గుడివాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

సంబంధిత పోస్ట్