పామర్రు నియోజకవర్గ జనసేన ఇంచార్జ్ తాడిశెట్టి నరేష్ శుక్రవారం స్థానిక పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను విమర్శించే స్థాయి పేర్ని నానికి లేదని అన్నారు. పవన్ కళ్యాణ్ ప్రశ్నించడంతోనే ప్రజలు మిమ్మల్ని చీ కొట్టి 11 సీట్లకు పరిమితం చేశారని, మీరు అధికారంలో ఉన్నప్పుడు రేషన్ బియ్యం అమ్ముకున్నారని విమర్శించారు.