పామర్రులో ఇంటి తాళాలు పగలగొట్టి నాలుగు లాప్ టాప్ లు దొంగిలించిన నిందితుడిని శనివారం స్థానిక బస్టాండ్ లో అరెస్టు చేసినట్లు సర్కిల్ ఇన్స్పెక్టర్ సుభాకర్ తెలిపారు. అనారోగ్య కారణాలతో రాజమండ్రిలోని కిమ్స్ హాస్పటల్ కు వెళ్లిన మార్పిన చందాన ఇంట్లో ఈ దొంగతనం జరిగినట్లు ఆయన పేర్కొన్నారు. గుర్తుతెలియని దొంగలు తాళాలు పగలగొట్టి లాప్ టాప్ లు దొంగిలించి పరారీ అయినట్లు తెలిపారు.