పామర్రు: హెల్త్ క్లినిక్ కు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే

మొవ్వ మండలం కోసూరు గ్రామంలో బుధవారం 55 లక్షల వ్యయంతో నిర్మించనున్న విలేజ్ హెల్త్ క్లినిక్ (ఆరోగ్య కేంద్రం) నిర్మాణానికి ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పేదల కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఇంచార్జ్ తాడిశెట్టి నరేష్, రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ లింగమనేని రామలింగేశ్వరరావు కూడా పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్