పామర్రు పోలీస్ స్టేషన్ నూతన ఎస్ఐగా కే శ్రీనివాస్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఆయనకు స్టేషన్ సిబ్బంది ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ, పామర్రు మండలంలో కోడిపందాలు, పేకాట, గంజాయి, క్రికెట్ బెట్టింగ్ వంటి అసాంఘిక కార్యక్రమాలను సహించబోమని, వాటిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.