పామర్రు నియోజకవర్గంలోని పలు పరిశ్రమ యూనిట్లను బుధవారం జిల్లా కలెక్టర్ డీకే బాలాజి క్షేత్రస్థాయిలో సందర్శించి పరిశీలించారు. ప్రభుత్వ రాయితీలతో ఏర్పాటు చేసిన చిన్న తరహా పరిశ్రమల పనితీరు, ఉత్పత్తి సామర్థ్యం, ఉపాధి అవకాశాలపై సమగ్రంగా ఆరా తీశారు. ఈ సందర్భంగా పామర్రులో ఏర్పాటు చేసిన మష్రూమ్ ప్రొడక్షన్ యూనిట్‌ను సందర్శించిన కలెక్టర్ కు యూనిట్ వ్యవస్థాపకులతో మాట్లాడారు.