పామర్రు: ప్రజా సమస్యలు తెలుసుకున్న ఎమ్మెల్యే

పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు వినూత్నంగా గ్రామాలకు సైకిల్‌పై వెళ్తున్నారు. గురువారం పామర్రు పట్టణంలోని పలు ప్రాంతాల్లో ఆయన సైకిల్‌పై తిరుగుతూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. 'పల్లెబాట' కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటిని సందర్శించి, ప్రజల సమస్యలను తెలుసుకొని పరిష్కార మార్గాలను అన్వేషిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈ పద్ధతి ద్వారా ప్రజలకు మరింత చేరువయ్యే ప్రయత్నం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్