ప్రగతి పదంలో పామర్రు పల్లె నిద్ర కార్యక్రమంలో భాగంగా పామర్రు టౌన్ ఇందిరానగర్ కాలనీలో కార్యకర్త ఇంట్లో పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా శుక్రవారం రాత్రి నిద్ర చేశారు. తొలుత ఇందిరానగర్ కాలనీలో ప్రజలు వద్దకు వచ్చి పలు సమస్యలను విన్నవించారు. ప్రాధాన్యత క్రమంలో ప్రతి సమస్యను పరిష్కరిస్తానని, కూటమి ప్రభుత్వంలో గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే వివరించారు.