పామర్రు నియోజకవర్గ పమిడిముక్కల మండలం తాడంకి గ్రామంలో వైసీపీ మండలస్థాయి సమావేశం సోమవారం నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ మాట్లాడుతూ, పార్టీ బలోపేతానికి అందరూ సమిష్టిగా కృషి చేయాలన్నారు. రానున్న రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా టీడీపీ మరియు కూటమి ప్రభుత్వ మోసాలను స్కాన్ చేసి ప్రజలకు ఎలా వివరించాలో తెలిపారు. నాయకులకు, కార్యకర్తలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు పాల్గొన్నారు.