రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం కృష్ణా జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 10:30 గంటలకు పమిడిముక్కల మండలంలో ప్రజా వేదిక కార్యక్రమంలో పాల్గొని, అనంతరం వీరంకిలాకులోని ఎన్టీఆర్ కాలనీలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. మేడే సందర్భంగా కార్మికులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకుంటారు. ఈ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను జిల్లా అధికారులు పూర్తి చేశారు.