పమిడిముక్కల: వరిధాన్యం కల్లాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్

పమిడిముక్కల మండలం మర్రివాడ గ్రామంలో రోడ్డు పక్కన ఆరబెట్టిన వరిధాన్యం కల్లాలను బుధవారం జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ పరిశీలించారు. రైతుల వద్దకు వెళ్లి తేమ శాతం, ధాన్యం ఆరబెట్టిన రోజుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రతి ధాన్యపు గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, రైతులు అధైర్య పడవద్దని కలెక్టర్ భరోసా ఇచ్చారు.

సంబంధిత పోస్ట్