పమిడిముక్కల: విద్యుత్ షాక్‌తో ఇంటర్ విద్యార్థిని మృతి

కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గంలోని పమిడిముక్కల మండలం లంకపల్లి గ్రామంలో శుక్రవారం ఉదయం విషాదం చోటు చేసుకుంది. మంచినీళ్ల కోసం పాఠశాల కుళాయి వద్దకు వెళ్లిన ఇంటర్ విద్యార్థిని ముళ్లపూడి అంకిత (16) విద్యుత్ షాక్‌తో మృతి చెందింది. రాత్రి ఈదురు గాలులకు తెగిపడి ఉన్న విద్యుత్ వైరు తగలడంతో ఈ ప్రమాదం సంభవించింది. తెగిపడిన వైర్లలో విద్యుత్ ప్రవహించడమే దీనికి కారణమని తెలుస్తోంది.

సంబంధిత పోస్ట్