తోట్లవల్లూరు మండలం రొయ్యూరులో 7 ఏళ్ల నిదిష్ అనే బాలుడు అదృశ్యమయ్యాడు. నిమ్మకూరుకు చెందిన నిదిష్ శనివారం స్కూలుకు సెలవు కావడంతో అమ్మమ్మ గ్రామమైన రొయ్యూరుకు వెళ్లాడు. ఆడుకోవడానికి వెళ్లిన అతను సాయంత్రం వరకు తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.