తోట్లవల్లూరు: సంక్షేమమే పరమావధిగా కూటమి ప్రభుత్వ పాలన

సంక్షేమమే పరమావధిగా కూటమి ప్రభుత్వ పాలన కొనసాగిస్తుందని పామర్రు నియోజకవర్గ శాసనసభ్యులు వర్ల కుమార్ రాజా అన్నారు. తోట్లవల్లూరు మండలం వల్లూరుపాలెం, చినపులిపాక గ్రామాలలో సుపరిపాలన-తొలి అడుగు కార్యక్రమాన్ని గురువారం రాత్రి నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇచ్చిన హామీ ప్రకారం ఒకటవ తరగతి, ఇంటర్మీడియట్ విద్యార్థులకు నగదు జమ చేసినట్టు తెలిపారు. ప్రతి ఇంటికి పథకాలు అందుతున్నాయన్నారు.

సంబంధిత పోస్ట్