తోట్లవల్లూరు మండలం పెనమకూరు గ్రామం ఏనుగుల కోడు వంతెన రక్షణ గోడలు శంకుస్థాపన కార్యక్రమంలో గురువారం సాయంత్రం జరిగింది. పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా పాల్గొని కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాలుగా వైసిపి ప్రభుత్వంలో ఎలాంటి అభివృద్ధి రాష్ట్రంలో జరగలేదన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయినాక రైతులకు మేలు జరుగుతుందన్నారు.