తోట్లవల్లూరు: ప్రమాదంలో గృహం దగ్ధం

మంగళవారం అర్ధరాత్రి పామర్రు నియోజకవర్గం తోట్లవల్లూరు మండలం యాకమురు గ్రామంలో సాయిబు ఇంటికి నిప్పు అంటుకుంది. ఈ ప్రమాదంలో ఇంట్లోని వస్తువులతో పాటు పక్కనే ఉన్న పశువులు కూడా గాయపడ్డాయి. స్థానికుల సహాయంతో మంటలను ఆర్పే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. కక్షపూరితంగానే తన ఇంటిని తగలబెట్టారని యజమాని సాయిబు ఆరోపించారు.

సంబంధిత పోస్ట్