తోట్లవల్లూరు మండలం పెనమకూరు గ్రామంలోని జడ్పీ హై స్కూల్ లో బుధవారం వార్షికోత్సవ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా రూ. 48.55 లక్షల వ్యయంతో నిర్మించిన భవనాన్ని, రూ. 24.33 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన కెమిస్ట్రీ ల్యాబ్ ను ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా ప్రారంభించారు. విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఎమ్మెల్యే ఈ సందర్భంగా తెలిపారు. జనసేన పార్టీ ఇంచార్జ్ తాడిశెట్టి నరేష్, మండల అధ్యక్షులు వీరపనేని శివరామ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.