తోట్లవల్లూరు మండలంలో జూద శిబిరాలపై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. బుధవారం పాములలంక గ్రామంలో జరుపుతున్న జూదంపై పమిడిముక్కల సీఐ చిట్టిబాబు సారథ్యంలో పోలీసులు ఆకస్మిక దాడి చేశారు. ఈ దాడుల్లో 11 మంది జూదరులను పట్టుకొని, వారి వద్ద నుంచి రూ.47 వేలు నగదు, 6 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.