ఉయ్యూరు: యువకుడి మృతి.. 25 మందికి గాయాలు

ఉయ్యూరు సమీపంలో విజయవాడ-మచిలీపట్నం రహదారిపై అర్ధరాత్రి తర్వాత ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. యానాం నుంచి హైదరాబాద్ వెళ్తున్న ప్రైవేట్ బస్సు, ఆకివీడు - విజయవాడ వైపు వస్తున్న లారీని వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో పాలరేవు గ్రామానికి చెందిన గణేశ్ అనే యువకుడు మృతి చెందగా, సుమారు 25 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను 108 సిబ్బంది ఉయ్యూరు, విజయవాడ ఆసుపత్రులకు తరలించారు.

సంబంధిత పోస్ట్