బంటుమిల్లి: రోడ్డు ప్రమాదంలో 16 మందికి గాయాలు

కృష్ణా జిల్లాలో శుక్రవారం ఉదయం అంతర్వేది తిరునాళ్లకు వెళ్లి వస్తున్న వాహనం బోల్తా పడి 16 మందికి గాయాలయ్యాయి. నాగాయలంక మండలం సొర్లగొంది గ్రామస్తులు ప్రత్యేక వాహనంలో తిరునాళ్లకు వెళ్లి తిరిగి వస్తుండగా, బంటుమిల్లి మండలం పెందుర్తి వద్ద వాహనం కల్వర్టును ఢీకొని బోదిలోకి దూసుకుపోయింది. గాయపడిన వారిని మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్