విద్య ద్వారానే ఉజ్వల భవిష్యత్ సాధ్యమవుతుందని నియోజకవర్గ శాసనసభ్యులు కాగిత కృష్ణ ప్రసాద్ పేర్కొన్నారు. గురువారం బంటుమిల్లి గ్రామంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో మెగా పేరెంట్స్ డే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తల్లికి వందనం పథకాన్ని అమలు చేసి ప్రతి విద్యార్థి ఖాతాలో 13 వేలు నగదు వేస్తున్నట్లు తెలిపారు.