బంటుమిల్లిలో ఏపీ బీసీ కో-ఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్, ప్రముఖ న్యాయవాది అంగర రంగనాథ్‌పై శుక్రవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. స్థానికులు వెంటనే స్పందించి ఆయనను ఆసుపత్రికి తరలించారు. దాడికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. పోలీసులకు సమాచారం అందించగా, ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలిసింది.